News February 24, 2025

ఏలూరు: కళ్లల్లో కారం కొట్టి.. బ్యాగ్ అపహరణ

image

ఏలూరు వన్ టౌన్ నుంచి టూ టౌన్ కి నగదు బ్యాగ్ తో వెళ్తున్న నిడదవోలుకు చెందిన కాస్మెటిక్స్ తయారీ కంపెనీ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ గొట్టాల వీరేశ్ పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. బైక్ పై వచ్చిన వారు వీరేశ్‌ను ఆపి, కళ్లల్లో కారం కొట్టి బ్యాగ్ లాక్కుపోయారు. అందులో రూ. 2,41,600 నగదు ఉందని, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 24, 2025

వారికి క్షమాపణలు చెప్పిన ‘ఛావా’ డైరెక్టర్

image

‘ఛావా’ సినిమాలో తమ పూర్వీకులు గనోజీ, కన్హాజీ షిర్కేను అవమానించారనే వారసుల ఆరోపణలపై దర్శకుడు లక్ష్మణ్ ఉటెకర్ స్పందించారు. తనకు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని చెప్పారు. ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించాలని కోరారు. అంతకుముందు సినిమాలో తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశారని రూ.100 కోట్ల పరువు నష్టం వేస్తామని షిర్కే వారసులు దర్శకుడిని హెచ్చరించారు. మరోవైపు ఛావా థియేటర్లలో హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.

News February 24, 2025

ఖజానా ఖాళీ..! డబ్బులు ఇల్లె..!!

image

దేశంలో ఇటీవల కొత్తగా ముఖ్యమంత్రులు అయిన వారంతా చెబుతున్న మాటలివి. పథకాలు అమలు చేద్దామన్నా, ఆర్థికపర నిర్ణయాలు తీసుకుందామన్నా ఖజానా ఖాళీ అయింది అని మొన్న తెలంగాణ సీఎం రేవంత్, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు, నేడు ఢిల్లీ సీఎం రేఖ అంటున్నారు. ఇందుకు చెప్పే కామన్ కారణం గత పాలకుల నిర్ణయాలు. రేపటి పాలకులు ఈ మాట చెప్పొద్దంటే కనీస అవసరాలు కాని ఉచితాలు ఆపేయడమే పరిష్కార మార్గం. నేతలు ఈ నిర్ణయం తీసుకోగలరా?

News February 24, 2025

తండ్రి చనిపోయిన దు:ఖంలోనూ రచయితకు ప్రభాస్ సాయం!

image

హీరో ప్రభాస్‌పై ‘బిల్లా’ రచయిత తోట ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను 2010 FEBలో ఆస్పత్రిపాలయ్యా. అదేరోజు ప్రభాస్ గారి తండ్రి సూర్య నారాయణ రాజు గారు చనిపోయారు. దుఖంలో ఉన్నప్పటికీ ఆయన నా వైద్యం కోసం డబ్బులు పంపించి హెల్ప్ చేశారు. నాపట్ల అంత కేర్ తీసుకున్నారాయన. తండ్రిని కోల్పోయినప్పటికీ నా సినిమా రైటర్ అని నా గురించి ఆలోచించారు’ అని తనకు ప్రభాస్ చేసిన సాయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

error: Content is protected !!