News October 14, 2025
ఏలూరు: కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

HYD బాలానగర్ PS పరిధిలో దారుణ ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో తల్లి తన ఇద్దరు కవల పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. పద్మారావు నగర్ ఫేజ్-1లో ఉంటున్న సాయిలక్ష్మి(27) తన రెండేళ్ల వయసు ఉన్న కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిని గొంతు నులిమి చంపి, అనంతరం భవనం పైనుంచి దూకి చనిపోయింది. సాయిలక్ష్మి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు.
Similar News
News October 14, 2025
WGL: రూ.30 పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,930 పలకగా.. ఈరోజు (మంగళవారం) రూ.30 పెరిగి, రూ. 6,960 అయిందని వ్యాపారస్తులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలలో తేడాలు ఉంటాయని పేర్కొన్నారు.
News October 14, 2025
విశాఖ: బంపర్ డ్రా.. లింక్ క్లిక్ చేస్తే..!

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ సిటీ పోలీసులు సూచించారు. లాటరీ, బంపర్ డ్రాలు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ చూపిస్తారని, అది నమ్మి లింక్ క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు కోల్పోతారని చెప్పారు. అటువంటి మెసెజ్‌లకు స్పందించవద్దని కోరారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే టోల్‌ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.
News October 14, 2025
వీటికి దూరంగా ఉంటే సంతోషమే!

మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇతరుల మీద ఫిర్యాదులు చేయడం, గుసగుసలు మాట్లాడటం, ఈర్ష్య, ఎదుటివారితో పోల్చుకోవడం, అతి వ్యసనాలు, అనుమానం, భయం, ద్వేషం’ వంటివి ‘మానసిక క్యాన్సర్ల’తో సమానం అని చెబుతున్నారు. ఇవి మన మనసును, శరీరాన్ని నెమ్మదిగా కుంగదీస్తాయంటున్నారు. వీటికి దూరంగా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటారని సూచిస్తున్నారు. మీరేమంటారు?