News April 18, 2024

ఏలూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తొలి నామినేషన్

image

దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలపాటి నరసింహామూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గురువారం దెందులూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

Similar News

News November 1, 2025

భీమవరం: పింఛన్లు అందజేసిన కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతోందని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం వీరమ్మ పార్క్ చుట్టుపక్కల శనివారం లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్లు అందించారు. లబ్దిదారులకు పింఛన్లు అందజేసి వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా అని ఆరా తీశారు.

News November 1, 2025

పోలవరం నిర్వాసితులకు రూ.1,100 కోట్లు.. నేడు చెక్కుల పంపిణీ

image

పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా రూ.1,100 కోట్లు విడుదల చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేయనున్నారు. జనవరిలో మిగిలిపోయిన వారికి, 41.15 కాంటూర్ పరిధిలోని మరికొన్ని గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఈ పరిహారం అందనుంది.

News November 1, 2025

ఫ్లై ఓవర్ పనుల జాప్యంపై కలెక్టర్ నాగరాణి ఆగ్రహం

image

తణుకు మండలం ఉండ్రాజవరం కూడలి వద్ద వంతెన నిర్మాణ పనుల జాప్యంపై భీమవరం కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జాప్యానికి కారణం ఏంటని నేషనల్ హైవే అధికారులను, గుత్తేదారుడి సహాయకుడిని ఆమె నిలదీశారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.