News March 11, 2025
ఏలూరు: కానిస్టేబుల్ ఒంటిపై 9 చోట్ల కత్తి గాయాలు

సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఐడి పార్టీ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నరేశ్‌పై అంతర్ రాష్ట్ర దొంగగా గుర్తించబడిన సురేందర్ కత్తితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. సురేందర్ ఏలూరు జిల్లా చాట్రాయి మండలానికి చెందిన వాడని పోలీసులు చెప్పారు. అటు నరేశ్ శరీరంపై మొత్తం 9 చోట్ల కత్తితో చేసిన గాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 19, 2025
భారత్‌ను ప్రేమించే వాళ్లందరూ హిందువులే: మోహన్ భాగవత్

భారత్‌ను ప్రేమించే వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ దేశంగా ఇండియా ఉండటానికి అధికారిక డిక్లరేషన్ అవసరం లేదని, మన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు దాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అస్పాంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ‘హిందూ అనేది కేవలం మతపరమైన పదం కాదు. వేల ఏళ్ల నాగరికత గుర్తింపు. భారత్, హిందూ రెండూ పర్యాయపదాలు’ అని తెలిపారు.
News November 19, 2025
వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేయవద్దు: వరంగల్ సీపీ

నేరగాళ్లు టెక్నాలజీని వాడుకొని నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం వరంగల్ మెడికల్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలను పోస్ట్ చేయవద్దని, ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆయన హెచ్చరించారు.
News November 19, 2025
43 మంది నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

బిహార్‌లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా 43 మంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారిపై క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈనెల 21 లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ లోపు స్పందించకపోతే పార్టీ నుంచి తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


