News April 13, 2025
ఏలూరు: కుమార్తెకు న్యాయం చేయాలని తండ్రి ధర్నా

తన కుమార్తెకు న్యాయం చేయాలని తండ్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ముసునూరులోని అక్కిరెడ్డిగూడెనికి చెందిన ఉమా శిరీష, నవీన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ప్రేమ వ్యవహారంలో చెలరేగిన వివాదంలో శిరీష పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడిని అరెస్ట్ చేయాలని తండ్రి నాగరాజు పురుగుమందు డబ్బాతో ధర్నా చేశాడు. పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 14, 2025
‘డబ్బులు ఊరికే రావు’ అని చిన్నప్పటి నుంచే చెప్పండి..

పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే డబ్బు పాఠాలు నేర్పాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అడిగినంత డబ్బులిస్తే ఆర్థిక క్రమశిక్షణ కొరవడుతుంది. పిల్లలు అవసరానికే కొంటున్నారా? ఆకర్షణకు లోనై ఖర్చు చేస్తున్నారా? అనే విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఖర్చు, పొదుపు మధ్య తేడాను వివరించాలి. పొదుపుతో కలిగే లాభాలు చెబితే ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఉన్నంతలో ఎలా జీవించాలో నేర్పిస్తే భవిష్యత్తు బాగుంటుంది.
News April 14, 2025
ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు కుట్ర..!

వివాహేతర సంబంధంతో ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖానాపురం హవేలీ సీఐ భానుప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన కథనం ప్రకారం.. ముదిగొండ (మం) సువర్ణపురంకు చెందిన ధర్మ భార్యతో.. రామాంజనేయులు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎలాగైనా ప్రియురాలి భర్త(ధర్మ)ను అడ్డు తొలగించాలని తన స్నేహితులతో కుట్ర చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
News April 14, 2025
సంగారెడ్డి: ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం

మైనార్టీ గురుకుల పాఠశాలలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం www.tmreis.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు సమీపంలోని మైనార్టీ పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.