News September 20, 2025
ఏలూరు: కోర్టు మానిటరింగ్ సభ్యులతో ఎస్పీ సమీక్ష

ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల విచారణ వేగవంతం చేసేందుకు సాక్షులను సకాలంలో హాజరుపరచాలని ఎస్పీ సూచించారు. నేరస్తులు తప్పించుకోకుండా, బాధితులకు న్యాయం జరగాలని ఆదేశించారు. కోర్టు ప్రక్రియను ప్రతిరోజు నమోదు చేయాలని సూచించారు.
Similar News
News September 20, 2025
NRPT: పథకాలను సద్వినియోగం చేసుకోండి

ప్రభుత్వం మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీల అభ్యున్నతి కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి M.A.రషీద్ శనివారం కోరారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకంలో భాగంగా వితంతువు, విడాకులు, అనాథలకు వ్యాపారం చేసుకునేందుకు రూ.50 వేలు, ఫకీర్, దూదేకులకు లక్ష ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.
News September 20, 2025
బాపట్ల జిల్లాకు భారీ వర్ష సూచన

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ శనివారం తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్లకింద నిలబడరాదని సూచించారు.
News September 20, 2025
HYD: అసలు మెట్రో మ్యాన్‌ను ఎందుకు తప్పించినట్టు?

మెట్రో పనులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 18 సంవత్సరాలు.. హైదరాబాద్ మెట్రో అంటే ఆయన పేరే గుర్తుకు వస్తుంది. మెట్రో మ్యాన్ అనే పేరు కూడా సంపాదించుకున్నారు. ఆయనే ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో ఎండీగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన ఆయన్ను రేవంత్ రెడ్డి ఎందుకు తప్పించారు అనేది ఇపుడు సిటీలో చర్చనీయాంశంగా మారింది. అసలే సందిగ్ధంలో ఉన్న మెట్రో నిర్వహణపై ఎండీ మార్పు ప్రభావం పడుతుందనేది నిర్వివాదాంశం.