News January 24, 2026

ఏలూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రమాదంలో మృతి చెందింది వీరే

image

గ్రీన్ ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన కొమ్ము సాయి, కామవరపుకోట మండలం రామవరానికి చెందిన గట్టు రాంబాబు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై బైక్ అదుపు తప్పి రైలింగ్ ఢీకొనడంతో వారిద్దరూ మృతి చెందారు. వారిద్దరూ వరుసకు బావ బావమరుదులు. మొక్కజొన్న కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది.

Similar News

News February 15, 2026

వేములవాడకు చేరుకున్న మంత్రి పొన్నం

image

వేములవాడలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం రాత్రి వేములవాడ భీమేశ్వరాలయం గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఆలయ ఈవో రమాదేవి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి రాజరాజేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈరోజు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

News February 15, 2026

ఏలూరు: ఆ అధికారి అవినీతి జలగ!

image

కోటరామచంద్రపురంలోని ఐటీడీఏలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉన్నతాధికారి అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అంతే కాకుండా తన పరిధిలో ఉన్న వసతి గృహాల్లో పనిచేస్తున్న సిబ్బందిని తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారట. ఒక వార్డెన్ ఇటీవల అక్రమాలు చేస్తూ దొరికినా చర్యలు తీసుకోవడం మానేసి ఆ వార్డెన్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. గతంలోనూ ఇక్కడ పని చేసిన అధికారిది ఇదే తంతు కావడంతో విధుల నుంచి తప్పించడం గమనార్హం.

News February 15, 2026

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ముప్పు ఎవరికి ఎక్కువంటే?

image

* గతంలో ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్లలో మరోసారి కూడా వచ్చే అవకాశముంది. * భాగస్వామి నుంచి గనేరియా, క్లమీడియా వంటి లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకిన మహిళల్లో ఈ ముప్పు కనిపించవచ్చు. * సంతాన సాఫల్యత కోసం చికిత్సలు తీసుకుంటున్నవారు. * ఫెలోపియన్‌ ట్యూబుల్లో లోపాలుండి, వాటిని సరిదిద్దేందుకు శస్త్రచికిత్స తీసుకున్నవారు. * పొగతాగే అలవాటు ఉన్న మహిళల్లో ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీకి అవకాశాలు ఎక్కువ.