News December 15, 2025
ఏలూరు: చెరువులో పడి YCP నేత మృతి

కామవరపుకోట(M) గుంటుపల్లిలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఏలూరు జిల్లా వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొమ్మిన నరేశ్ మృతి చెందారు. చెరువులో చేపలకు మేత వేసే క్రమంలో పంటి తిరగబడి మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు. నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 17, 2025
మీ బ్రెయిన్ వయస్సుని ఇలా తగ్గించుకోండి

వయస్సు పెరగడం సహజమే. కానీ బ్రెయిన్‌ను యవ్వనంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. USకు చెందిన ఫ్లోరిడా వర్సిటీ చేసిన అధ్యయనంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించిన వారి మెదడు వాస్తవ వయస్సు కంటే 8 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మంచి నిద్ర, సరైన బరువు, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం, ఒత్తిడిని నియంత్రించడం వంటివి బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంచినట్లు తేలింది. తద్వారా ఓల్డేజ్‌లో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రావు.
News December 17, 2025
MBNR జిల్లాలో 81.44 శాతం ఓటింగ్.. లెక్కింపు ప్రారంభం

MBNR జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి జిల్లా వ్యాప్తంగా 81.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,16,379 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ముగిశాయి. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సా.5 గంటల వరకు ఫలితాలు వెలువడనున్నాయి.
News December 17, 2025
NZB: ఒంటి గంట అప్‌డేట్ 74.36 శాతం పోలింగ్

తుది దశ GP ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 12 మండలాల్లోని 165 GPల్లో 146 SPలకు, 1130 WM లకు నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. ఆలూర్ 75.37%, ఆర్మూర్-74%, బాల్కొండ-63.25%, భీమ్‌గల్-73.18%, డొంకేశ్వర్-77.39%, కమ్మర్పల్లి-72.85%, మెండోరా-76.29%, మోర్తాడ్-75.87%, ముప్కాల్-76.61%, నందిపేట్-78.04%, వేల్పూర్-75.01%, ఏర్గట్ల-75.92% పోలింగ్ నమోదైనట్లు వివరించారు.


