News January 22, 2026

ఏలూరు: జాతర రూట్ మ్యాప్‌ను పరిశీలించిన ఎస్పీ

image

ఏలూరు తూర్పు వీధిలో ఈనెల 25, 26 తేదీల్లో జరగనున్న గంగానమ్మ తల్లి జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. గురువారం అమ్మవారిని దర్శించుకున్న ఆయన, జాతర నిర్వహించే మార్గాలను (రూట్ మ్యాప్) స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Similar News

News February 10, 2026

ఉపవాసం: ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు?

image

ఉపవాసం శ్రేష్ఠమైనదే అయినా అందరికీ వర్తించదు. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మధుమేహం, రక్తహీనత, గుండె జబ్బులు ఉన్నవారు సుదీర్ఘ సమయం ఆహారం మానేస్తే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. స్థూలకాయులు, BP, చర్మ వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహాతో ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

News February 10, 2026

స్పీకర్‌పై అవిశ్వాసం.. మెజార్టీ ఉంటేనే!

image

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్షాలు ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 94-C కింద తీర్మానం ప్రవేశ పెట్టాలి అంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలి. సభలోని 50 మంది సభ్యులు మద్దతుతో నోటీసు ఇచ్చాక చర్చకు నిర్దేశిస్తారు. 10 రోజుల్లోపే చర్చ చేపట్టి ఓటింగ్ నిర్వహిస్తారు. మెజార్టీ ఆధారంగా అనర్హత వేటు ఉంటుంది. కాగా లోక్‌సభలో NDAకే మెజార్టీ ఉండటంతో స్పీకర్ తొలగింపు అసాధ్యమే.

News February 10, 2026

NTR: అరుణాచలం వెళ్లేవారికి ఊరట కలిగించే వార్త

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా కాకినాడ టౌన్(CCT)-అరుణాచలం(తిరువణ్ణామలై- TNM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07617 CCT-TNM రైలు FEB 14న, నం.07618 TNM-CCT రైలు FEB 16న నడుస్తాయన్నారు. ఈ రైళ్లు మార్గమధ్యంలో సామర్లకోట, రాజమండ్రి, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు తదితర స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.