News October 13, 2025

ఏలూరు జాయింట్ కలెక్టర్‌గా ఎం‌జే అభిషేక్ గౌడ

image

ఏలూరు జాయింట్ కలెక్టరుగా ఎంజే అభిషేక్‌ గౌడ సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ కె.వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పూల గుత్తి అందించారు. జిల్లాలో పౌరసరఫరాల శాఖ మరింత పట్టిష్టంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని, రైతుసేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నూతన జేసీకి సూచించారు.

Similar News

News October 13, 2025

HYD: ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు నంబర్ వన్!

image

చర్లపల్లి జైలును ఈరోజు సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు దేశానికి ఆదర్శమన్నారు. ఖైదీలకు బీమా, కుటుంబ సభ్యులకు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్ అద్భుతమని, ఖైదీల ఉత్పత్తులతో ప్రత్యేక మేళా నిర్వహించాలని సూచించారు.

కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్

image

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై అనిల్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు పెట్టారని, లాటరీలో షాపు దక్కకపోతే ఆ డబ్బు ఎక్సైజ్ శాఖకే వెళ్తుందన్నారు. షాప్ రానివారికి రూ.3 లక్షలు తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని, ఆ GOను కొట్టేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఎక్సైజ్ శాఖకు నోటీసులు జారీ చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.