News December 30, 2025

ఏలూరు జిల్లాను మోహరించిన పోలీసులు

image

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. దర్శనం కోసం వేచి ఉండే భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా, క్యూలైన్లను క్రమబద్ధీకరించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. భద్రతను పర్యవేక్షించడానికి తొలిసారిగా అధునాతన డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు.

Similar News

News December 30, 2025

NEW YEAR: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో

image

న్యూ ఇయర్ వేళ నగరవాసులకు మెట్రో గుడ్ ‌న్యూస్ చెప్పింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రేపు 31ST నైట్ ఈవెంట్ల నేపథ్యంలో అర్ధరాత్రి కూడా మెట్రో రైల్ సేవలు అందించనుంది. జనవరి 1న అర్ధరాత్రి ఒంటి గంటకు చివరి రైలు ఉంటుంది. ఈ న్యూ ఇయర్‌కి జర్నీ స్ట్రెస్ లేకుండా సెలబ్రేషన్ చేసుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
SHARE IT

News December 30, 2025

నూతన వేడుకలను సంతోషంగా నిర్వహించుకోండి: SP

image

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సంతోషంగా నిర్వహించుకోవాలని SP సతీష్ కుమార్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు. మద్యం తాగి వాహనాలను నడిపితే మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్ 185 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసి, పూర్తిగా రద్దు చేస్తామన్నారు.

News December 30, 2025

మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించాలి: కలెక్టర్

image

జిల్లాలోని చెంచు గిరిజనులకు మెరుగైన, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన ఉత్పత్తులపై శిక్షణ, జీవనోపాధి అవకాశాలపై సమావేశం నిర్వహించారు. డీఎఫ్‌ఓ విఘ్నేష్, డీఆర్‌ఓ రామునాయక్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.