News February 25, 2025

ఏలూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు ఎందరంటే?

image

ఈ నెల 27న ఉదయం 8 గం. నుంచి సాయంత్రం 4 గం.వరకు జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఉమ్మడి ఉభయ గోదావరిలో 3,14,984 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 456 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఏలూరు జిల్లాలో 42,282 మంది ఓటర్లు ఉన్నారని, 66 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. మంగళవారం సాయంత్రం 4.గంటల అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు.

Similar News

News March 3, 2026

HCUలో PhDకి దరఖాస్తు చేసుకోండి

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ (HCU) PhD కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దాదాపు 13 కోర్సుల్లో కోర్సులు చేసేందుకు అవకాశముంది. ఆసక్తి, అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. కోర్సులు, అర్హత వివరాలు, ఫీజు తదితర వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో <>http://acad.uohyd.ac.in/<<>> చూడండి.

News March 3, 2026

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు- కలెక్టర్

image

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాలో బాణసంచా తయారీ నిల్వ విక్రయ కేంద్రాల వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యలను అత్యంత కట్టుదిట్టం చేయాలన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద పేలుడుతో 21 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.

News March 3, 2026

సింగరకొండ రథోత్సవానికి 650 మంది పోలీసులతో భద్రత

image

సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి 71వ వార్షికోత్సవం, రథోత్సవ బందోబస్తును ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు సోమవారం పరిశీలించారు. ఇవాళ జరగనున్న రథోత్సవానికి ముగ్గురు DSPలు, నలుగురు CIలు, 40 మంది SIలతో కలిపి మొత్తం 650 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు.