News December 27, 2025
ఏలూరు జిల్లాలో ఒక రోజు ముందే రూ.113 కోట్ల పంపిణీ

జనవరి నెల సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 31 వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,59,151 లక్షల మంది పెన్షన్ దారులకు 113.68 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో పెన్షన్ 31వ తేదీన 100% పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 31న తీసుకొని వారికి 2వ తేదీన పంపిణీ చేస్తారన్నారు.
Similar News
News January 3, 2026
KNR: నేడు జిల్లాల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజును ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో ఘనంగా వేడుకలు జరపాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇ.నవీన్ నికోలస్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేశారు. ప్రతిజిల్లాలో విద్యారంగంలో విశేష సేవలందించిన 10మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేసి ప్రభుత్వం సత్కరించనుంది.
News January 3, 2026
అనకాపల్లి జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

అనకాపల్లి జిల్లాలో 83 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కేజీబీవీ టైప్-3 విభాగంలో 20, టైప్-4 విభాగంలో 63 పోస్టులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
News January 3, 2026
ఏలూరు జిల్లా కస్తూర్బా స్కూళ్లలో ఉద్యోగాలు

కాకినాడ జిల్లాలో 2 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్ – 3 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. నేటి నుంచి జనవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. టెన్త్ పాసైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.


