News February 19, 2025
ఏలూరు: జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం

ఏలూరు జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. ఉంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళ (30) ఈనెల 18వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు జీబీఎస్ వైరస్‌గా అధికారులు నిర్ధారించారు. ఆమెను ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 22, 2025
ప్రభుత్వ బడుల్లో నేటి నుంచి ఆధార్ నవీకరణ శిబిరాలు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ వివరాల మార్పు, నవీకరణ కోసం నేటి నేటి నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,55,780 మంది విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంది. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో 95,251 మంది, కృష్ణా జిల్లాలో 60,529 మంది ఉన్నారు. పిల్లల వివరాలు సరిచేయడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.
News October 22, 2025
మంచిర్యాల: ఫ్లైఓవర్ పైనుంచి తోసి చంపేశాడు

మంచిర్యాల జిల్లాలో సోమవారం భార్యను భర్త హత్య చేసిన ఘటనలో CI ఆశోక్ వివరాలు వెల్లడించారు. మందమర్రి వాసి ఆశోక్ పెద్దపల్లి జిల్లా కనుకుల వాసి రజిత(30)తో 2013లో వివాహమైంది. పెళ్లైన సంవత్సరం నుంచే అనుమానంతో ఆమెను వేధించేవాడు. అత్తారింటికి వెళ్లిన ఆశోక్ ఈనెల 19న బంధువుల ఇంటికి వెళ్దామని బైక్‌పై రజితను తీసుకెళ్లాడు. CCC సమీపంలోని 363 <<18055726>>ఫ్లైఓవర్ <<>>పైనుంచి తోసేశాడు. 20న నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
News October 22, 2025
పల్నాడు శైవ క్షేత్రాలలో కార్తీక మాసం సందడి

పల్నాడులో ప్రముఖ శైవ క్షేత్రాలైన గుత్తికొండ, దైద, సత్రశాలలో కార్తీక మాసం సందడి నెలకొంది. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దైద, సత్రశాల ఆలయాలు కృష్ణా నది పక్కనే ఉండడంతో నదిలో మహిళలు ప్రత్యేక పుణ్య స్నానాలు చేశారు. అనంతరం గుత్తికొండ ఓంకారేశ్వరుడు, దైద అమరలింగేశ్వర స్వామి, సత్రశాల మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.