News March 16, 2025
ఏలూరు జిల్లాలో దారుణం

బాలుడిని చైన్లతో కట్టేసి బంధించిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. బాధితుడి తండ్రి వివరాల మేరకు.. నిడమర్రు మండలం ఉప్పరగూడేనికి చెందిన బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. కొల్లేరులో గొర్రెలు కాస్తున్న తండ్రి వద్దకు బయల్దేరాడు. మార్గమధ్యలో జిరాయితీ భూముల్లో బాలుడు చేపలు పట్టాడంటూ వెంకన్న, పండు అనే వ్యక్తులు బాలుడిని గ్రామంలోకి తీసుకెళ్లి కుక్కల గొలుసుతో కట్టేశారు. తర్వాత మందలించి బాలుడిని వదిలేశారు.
Similar News
News November 5, 2025
NLG: ఎట్టకేలకు రేషన్ సంచుల పంపిణీ!

రేషన్ లబ్ధిదారులకు ఎట్టకేలకు రేషన్ సంచులు పంపిణీ చేయనున్నారు. గత నెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం సంచులను ఐఎంజీ గోదాములకు సరఫరా చేసింది. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉండడంతో సంచులను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఐఎంజీ స్టాక్ పాయింట్ల నుంచి ఆయా రేషన్ షాపులకు సంచులు చేరాయి.
News November 5, 2025
NLG: కలకలం రేపుతున్న మహిళల అదృశ్యం ఘటనలు

జిల్లాలో మహిళల అదృశ్యం ఘటనలు కలకలం రేపుతుంది. తిప్పర్తి పీఎస్ పరిధిలో కాజీరామారం గ్రామానికి చెందిన కందుకూరి సౌజన్య(24), చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన వివాహిత మంకాల రేణుక(35)లు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ కూడా వివాహితులే కావడం విశేషం.
News November 5, 2025
కులవృత్తికి పేటెంట్ ఇవ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి

జిల్లాలోని పలువురు నాయీబ్రాహ్మణ సేవా సంఘం నాయకులు తమ పూర్వీకుల క్షురవృత్తి సంప్రదాయాన్ని కాపాడి నాయీబ్రాహ్మణులకే పరిమితం చేయాలని కలెక్టర్‌ను కోరారు. రాష్ట్ర కన్వీనర్ సుధాకర్, తిరుపతి నగర అధ్యక్షుడు సహదేవ జయకుమార్ నాయకత్వంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో సుమారు 3,750 మంది నాయీబ్రాహ్మణులు సెలూన్లపై ఆధారపడి ఉన్నారని, ఇతర కులస్తులు ప్రవేశించడంతో వృత్తి గౌరవం, ఆదాయం దెబ్బతింటుందన్నారు.


