News March 21, 2025
ఏలూరు జిల్లాలో నలుగురు మృతి

ఏలూరు జిల్లాలో గురువారం వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెంది ఏలూరుకి చెందిన మల్లేశ్వరరావు(40) ఉరి వేసుకున్నాడు. చింతలపూడిలో రిటైర్డ్ ఉద్యోగి హేమ ప్రకాశ్(65) అనుమానస్పద స్థితిలో చనిపోయారు. ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా(D) వేల్పూరికి చెందిన రవికుమార్ మృతి చెందాడు. భీమడోలు వద్ద రైలు నుంచి జారిపడి సుబ్బారెడ్డి(69) అనే వ్యక్తి చనిపోయాడు.
Similar News
News February 19, 2026
ఖానాపూర్ రాజకీయం.. BRSతో BJP పొత్తు

TG: నిర్మల్(D) ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. BJP పొత్తుకు ఆఫర్ చేయగా BRS అంగీకరించింది. మొదటి రెండేళ్లు BRS, తర్వాత మూడేళ్లు BJPకి ఛైర్మన్ పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. కోరం లేక ఇప్పటికే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక 2సార్లు వాయిదా పడింది. దీంతో ఎన్నిక తేదీ ప్రకటనపైనా ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 12 వార్డులకు గాను BJP 4, BRS 4, INC 3 చోట్ల గెలిచాయి.
News February 19, 2026
చోడవరం: ఏపీపీ చొరవతో ఒక్కటైన జంట

మనస్పర్ధలతో విడిపోయిన జంట ఏపీపీ చీపురుపల్లి సూర్యనారాయణ చొరవతో మళ్ళీ ఒకటయ్యారు. లక్ష్మీపురానికి చెందిన ఉగ్గిన దొరకు విశాఖకు చెందిన సింధుతో ఆరు నెలల క్రితం వివాహం అయింది. వారిద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుని దూరమైపోయారు. చోడవరం కోర్టులో కేసు దాఖలైంది. ఏపీపీ వారిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించి, వారి తల్లిదండ్రులతో చర్చించి న్యాయమూర్తుల సమక్షంలో బుధవారం ఇద్దరినీ మళ్లీ కలిపారు.
News February 19, 2026
నేడు మంగళగిరిలో పర్యటించనున్న జిల్లా కలెక్టర్

గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం మంగళగిరిలోని తాడేపల్లి నగరపాలక సంస్థలో పర్యటించనున్నారు. పార్కులు, మోడల్ టాయిలెట్స్, జంక్షన్ల అభివృద్ధి పనులను పరిశీలించనునట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు కాజలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శిస్తారు. ఆయా పనుల పరిశీలన అనంతరం 11 గంటలకు MTMC కార్యాలయంలో జరిగే నియోజకవర్గ సమీక్షలో పాల్గొననున్నట్లు ఆమె కార్యాలయ సిబ్బంది తెలిపారు.


