News March 29, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*జంగారెడ్డిగూడెంలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి. *అగిరిపల్లి మండలంలో 50 లక్షల తో నిర్మించే సీసీ రోడ్లకు మంత్రి పార్థసారథి శంకుస్థాపన.*జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తోడ్పాటు నివ్వాలి :కలెక్టర్.*జిల్లావ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. *విశ్వకర్మ కార్పొరేషన్ రుణాలను మంజూరు చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించిన మంత్రి. *జంగారెడ్డిగూడెంలో మంత్రి కందుల దుర్గేశ్ పర్యటన.

Similar News

News February 26, 2026

DGCA కొత్త రూల్స్.. 48 గంటల్లోగా..!

image

విమాన టికెట్ల రిఫండ్ రూల్స్‌లో DGCA సవరణలు చేసింది. టికెట్ కొన్న 48 గంటల్లోగా క్యాన్సిల్/మార్పులు చేస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు కట్టక్కర్లేదని చెప్పింది. అలాగే టికెట్లు క్యాన్సిలేషన్ డబ్బులను 14 రోజుల్లో రిఫండ్ చేయాలంది. అటు టికెట్లు బుక్ చేసుకున్న 24గంటల్లో పేర్లలో కరెక్షన్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజ్ తీసుకోవద్దని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. అనారోగ్య కారణాలతో కాన్సిల్ చేసుకున్నా ఇవి వర్తిస్తాయంది.

News February 26, 2026

చీపురుపల్లి నుంచి ప్రధానితో సీఎం వీసీ

image

ఈనెల 28న చీపురుపల్లి నుంచి సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్న 14-15 ఏళ్ల బాలికల ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొననున్నారు. CHC వద్ద ప్రత్యేక వేదిక, సాంకేతిక& వైద్య ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి బుధవారం ఆదేశించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

News February 26, 2026

కరీంనగర్ నూతన కొత్త కలెక్టర్‌ చిత్ర మిశ్రా ప్రొఫైల్

image

కరీంనగర్ జిల్లా పాలనా పగ్గాలను 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి చిత్ర మిశ్రా చేపట్టారు. సంగారెడ్డికి చెందిన ఆమె, నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా, మున్సిపల్ కమిషనర్‌గా సమర్థవంతంగా పనిచేశారు. ఇటీవల ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో విశేష కృషి చేశారు. యువ అధికారిణి రాకతో కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో సరికొత్త వేగం పుంజుకోనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.