News March 30, 2025
ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*ఏలూరులో జిల్లా జైలులో మహిళ ముద్దాయి అనుమానాస్పదస్థితిలో మృతి* ఏలూరు గిరిజన భవన్ లో జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొన్న కలెక్టర్*పెట్రోల్ పోసి వృద్ధురాలిని హతమార్చిన కేసులో వ్యక్తి అరెస్ట్*పాస్టర్ ప్రవీణ్ మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని జీలుగుమిల్లిలో ర్యాలీ*కొయ్యలగూడెం మండలం సీతంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Similar News
News April 1, 2025
బుక్కపట్నం: డైట్ కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో డిప్యూటేషన్‌పై పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తూ.. ఐదు సంవత్సరాలు పైబడి సర్వీస్ కలిగిన స్కూల్ అసిస్టెంట్స్, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 10 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News April 1, 2025
గద్వాల: ‘కుల వివక్షను రూపుమాపేందుకు పోరాటం చేద్దాం’

కుల వివక్షను రూపుమాపేందుకు KVPS ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు పేర్కొన్నారు. మంగళవారం గద్వాల పట్టణంలో జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పూలే, అంబేడ్కర్ స్ఫూర్తితో కుల వివక్షపై ప్రతిఘటన పోరాటాలు చేయాలన్నారు. కులం పేరుతో దూషించడం చట్టరీత్యా నేరమని అందరికీ తెలియజేయాలన్నారు.
News April 1, 2025
భార్యకు పెళ్లి చేసిన భర్త.. ఊహించని మలుపు

UP: భర్తే తన భార్యను ప్రియుడికిచ్చి <<15898025>>పెళ్లి చేసిన ఘటనలో<<>> సినిమా లెవల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడు వికాస్‌తో వెళ్లిపోయిన రాధిక మళ్లీ మొదటి భర్త బబ్లూ చెంతకు చేరింది. భార్యకు దూరమై పిల్లలిద్దరి బాధ్యత చూసుకుంటూ బబ్లూ అనుభవించే బాధ గురించి వికాస్ తల్లి తన కొడుక్కి అర్థమయ్యేలా చెప్పింది. దీంతో వికాస్ రాధికను తిరిగి బబ్లూ వద్దకు పంపాడు. తన భార్యను స్వీకరిస్తానని బబ్లూ పంచాయతీలో ఒప్పుకున్నాడు.