News April 5, 2025
ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.*శ్రీ రామ నవమికి 8టన్నుల బెల్లాన్ని వితరణ చేసిన దెందులూరు MLA.* చింతలపూడిలో దంచి కొట్టిన వర్షం..నేలకొరిగిన చెట్లు.*cm పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, మంత్రి.*2024, 25 రబీ పంట కాలానికి ధాన్యం సేకరణ ప్రారంభం.*ఆటో నగర్లో స్థలాలు ఇవ్వాలని మెకానిక్‌ల సమావేశం.
Similar News
News November 7, 2025
ధర్మారం: దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

ధర్మారం కటికెనపల్లికి చెందిన బోనగిరి వెంకటేశం ఇంట్లో జరిగిన చోరీ కేసులో గడమల్ల సదన్ కుమార్(19)ను అరెస్ట్ చేసినట్లు SI ప్రవీణ్ తెలిపారు. వెంకటేశం OCT 25న ఇంటికి తాళం వేసి వెళ్లాడు. బుధవారం ఇంటికొచ్చే సరికి చోరీ జరిగిందని గుర్తించి PSలో ఫిర్యాదు చేశాడు. విచారణలో సదన్ చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బంగారు, వెండి నగలు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్ చేసినట్లు SI చెప్పారు.
News November 7, 2025
భద్రాద్రి కలెక్టరేట్‌లో జాతీయ గీతాలాపన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యా చందన పాల్గొని వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే ఈ గేయం భారత స్వాతంత్య్ర సమరంలో పోషించిన విశిష్ట పాత్రను అధికారులు స్మరించుకున్నారు.
News November 7, 2025
వందేమాతరం దేశస్ఫూర్తికి ప్రతీక: SP

వందేమాతరం గేయం 150 ఏళ్ల వేడుకలను తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించింది. ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో సిబ్బందితో కలిసి వందేమాతరం ఆలపించారు. దేశభక్తితో నిండిన ఈ వేడుకలో ఎస్పీ మాట్లాడుతూ.. వందేమాతరం మన దేశస్ఫూర్తికి ప్రతీక అన్నారు. ప్రతి భారతీయుడు ఈ గేయాన్ని తమ హృదయంలో నిలుపుకోవాలని ఆయన కోరారు.


