News February 2, 2026
ఏలూరు జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

ఏలూరు జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు పట్టణంలో గంగానమ్మ జాతర మహోత్సవం సందర్భంగా ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు తదితర కారణాల దృష్ట్యా పీజీఆర్ఎస్‌ను రద్దు చేశామన్నారు. ప్రజలందరూ గమనించాలన్నారు.
Similar News
News February 6, 2026
ఫైనల్‌కు చేరిన పాలమూరు జట్టు

వరంగల్‌లో HCA ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్ ఉమెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ టోర్నీలో మహబూబ్‌నగర్ జట్టు ఖమ్మం జట్టుపై 34 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన MBNR జట్టు 18 ఓవర్లలో 103/4 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు 17 ఓవర్లలో 69 రన్స్‌కే ఆల్ అవుట్ అయింది. MBNR బౌలర్లు ప్రవళిక-5, మేఘన-4 వికేట్లు తీసి విజృంభించారు.
News February 6, 2026
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆర్ఓలు ఏఆర్ఓలు, కౌంటింగ్ అధికారులు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించారు. నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల్లో ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.
News February 6, 2026
ఈ నెల 17న కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఈ నెల 17న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు బి.క్రాంతి నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్త ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


