News March 19, 2024

ఏలూరు జిల్లాలో బాల్య వివాహం అడ్డగింత

image

ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో అధికారులు మంగళవారం ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమెకు పెళ్లి చేస్తున్నారని అందిన సమాచారం మేరకు ఇంటికి వెళ్లి అడ్డుకున్నామని జిల్లా బాలల సంరక్షణాధికారి డా.సీహెచ్ సూర్య చక్రవేణి తెలిపారు. అనంతరం బాల్య వివాహల వలన కలిగే నష్టాలపై తల్లిదండ్రులకు వివరించినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 31, 2024

ఉండ్రాజవరం: పిడుగుపాటు మరణాలపై సీఎం విచారం

image

ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెంలో బాణసంచా కేంద్రంపై పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వెగిరోతు శ్రీవల్లి, గుమ్మడి సునీత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన ఐదుగురికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

News October 31, 2024

పాలకోడేరులో సందడి చేస్తున్న అమెరికా పావురాలు

image

పాలకోడేరు మండలం మోగల్లులో అమెరికా పావురాలు సందడి చేస్తున్నాయి. గ్రామానికి చెందిన కంకిపాటి జోసఫ్‌ రెండు నెలల క్రితం తణుకు పట్టణం నుంచి రెండు పావురాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. వాటిని అమెరికా పావురాలు అంటారని, ఎవరు దగ్గరకు తీసుకొన్నా వారితో మమేకం అవుతాయని ఆయన చెప్పారు. పెసలు, కొర్రలు వాటికి ఆహారంగా పెడుతున్నామని జోసేఫ్ వివరించారు.

News October 31, 2024

ఉండ్రాజవరం: బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

image

ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలెం గ్రామంలో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బాణసంచా తయారీ కేంద్రంలో పిడుగు పాటుపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.