News March 28, 2024
ఏలూరు జిల్లాలో బీఎస్పీ అభ్యర్థులు జాబితా

ఏలూరు జిల్లాలో బీఎస్పీ పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆచార్య ఎన్‌ఏడీ పాల్, ఏలూరు అసెంబ్లీకి అందుగుల రతన్‌కాంత్, చింతలపూడి- ఎల్.చైతన్య, దెందులూరు – నేత రమేశ్ బాబు, ఉంగుటూరు- బుంగా ఏసు, కైకలూరు- మన్నేపల్లి నాగేశ్వరరావు, నూజివీడు – డాక్టర్ చెలిగంటి వెంకటేశ్వరరావు, పోలవరం – సరయం వెంకటేశ్వరరావులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News July 8, 2025
ఈనెల 14 వరకు పశుగ్రాస వారోత్సవాలు: కలెక్టర్

పశుగణాభివృద్ధితో పాటు మేలురకం పశుగ్రాసలసాగు ద్వారా అధిక పాల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్ధ్యం పెంపుదలకు ఈనెల 14 వరకు నిర్వహించే పశుగ్రాస వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. పశుగ్రాసం విత్తనాలను పశువైద్యశాలలో రైతుసేవ కేంద్రాల ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. రేపు వెంకట రామన్నగూడెంలో మేలుజాతి పశుగ్రాసాల ప్రదర్సన, పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.
News July 8, 2025
రాష్ట్ర స్థాయి అవార్డులు ఎంపికైన ప.గో జిల్లా అధికారులు

ఈనెల 9న రెడ్ క్రాస్ సేవలకుగాను పగో జిల్లా అధికారులకు గౌరవ గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డులు అందుకోనున్నారని జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ అధికారి వేంకటేశ్వరరావు, గ్రామీణ అభివృద్ధి శాఖ వేణుగోపాల్, మాజీ డీఈవో వెంకటరమణలు రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారన్నారు. రాష్ట్రస్థాయిలో అవార్డులను పొందడం జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు.
News July 8, 2025
తాడేపల్లిగూడెం: మద్యం తక్కువ పోశాడని హత్య

తాడేపల్లిగూడెం పాత రేలంగి చిత్ర మందిర్ సమీపంలో రెడ్డి గోవింద్ హత్య కేసులో నిందితుడైన గుబ్బల మల్లేశ్వరరావు (53)ను సోమవారం నరసింహారావుపేటలోని అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ఆదిప్రసాద్ తెలిపారు. మద్యం తక్కువ పోశాడని ప్రశ్నించడంతో నిందితుడు మల్లేశ్వరరావు రాయితో గోవింద్ తలపై కొట్టి పారిపోయినట్లు విచారణలో తేలిందని సీఐ వివరించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.