News October 18, 2025
ఏలూరు జిల్లాలో భారీగా గంజాయి తరలింపు

ఏలూరు జిల్లాలో 59 కేసులలో సీజ్ చేసిన 3403.753 కేజీల గంజాయిని గుంటూరు జిల్లాలోని జిందాల్ సంస్థ నిర్వహించే డిస్పోజల్ చేసేందుకు తరలిస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శనివారం తెలిపారు. పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా వీటిని డిస్పోజల్ చేస్తున్నట్లు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Similar News
News October 18, 2025
ఆలేరులో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. శనివారం ఆయన ఆలేరు మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు ఎంత ధాన్యం వచ్చింది? ఎంతవరకు కొనుగోలు చేశారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News October 18, 2025
ఆడపిల్లలకు చదువుకునే హక్కు ప్రతి ఒక్కరూ ఇవ్వాలి: కలెక్టర్

ఆడపిల్లలందరికీ చదువుకునే హక్కు తప్పకుండా ఇవ్వాలని, వారికి పౌష్టికాహారం అందించి, సమాజంలో లింగ వివక్ష లేకుండా చూడాలని ఇవాళ కలెక్టర్ సిరి అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో అన్నారు. జిల్లాలో కేవలం 56 శాతం ఉన్న అక్షరాస్యత రేటును 100 శాతంకి పెంచాలని కోరారు. విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో రాణించాలని, విద్యకు ప్రభుత్వం ఉచిత సౌకర్యాలు అందిస్తోందని, బాలికల రక్షణకు ‘స్త్రీ శక్తి’ యాప్ ఉందని పేర్కొన్నారు.
News October 18, 2025
USలో యాక్సిడెంట్.. తెలంగాణకు చెందిన తల్లి, కూతురు మృతి

TG: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన రమాదేవి(52), తేజస్వి(32) మృతిచెందారు. విఘ్నేష్, రమాదేవి దంపతుల కూతుళ్లు స్రవంతి, తేజస్వి తమ భర్తలు, పిల్లలతో కలిసి USలో ఉంటున్నారు. తేజస్వి ఫ్యామిలీ USలో నూతన గృహ ప్రవేశం చేయగా, కుటుంబ సభ్యులంతా వెళ్లారు. ఆ తర్వాత అందరూ కలిసి స్రవంతి ఇంటికి కారులో వెళ్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. రమాదేవి, తేజస్వి ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.