News March 24, 2024
ఏలూరు జిల్లాలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు

ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. కొయ్యలగూడెం మండలం పరంపూడి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు మహిళా వాలంటీర్లను, ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మరో వాలంటర్ను విధుల నుండి తొలగించామని తెలిపారు.
Similar News
News September 27, 2025
ఇంటర్లో ఇకపై బయాలజీ పేపర్ మాత్రమే: డిఐఈఓ ప్రభాకర్

గతంలో వేర్వేరుగా ఉండే బోటనీ, జువాలజీ సబ్జెక్టులు ఈ ఏడాది నుంచి బయాలజీ పేరుతో ఒకే పేపర్ నిర్వహించబడుతుందని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యా అధికారి జి.ప్రభాకర్ తెలిపారు. జిల్లాలోని బోటనీ, జువాలజీ అధ్యాపకులకు తణుకు ఎస్ఎన్వీటీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సబ్జెక్టులో మార్కులు ఎక్కువ రావడానికి అధ్యాపకులు సమన్వయం చేసుకుని సమష్టి కృషి చేయాలని కోరారు.
News September 27, 2025
కాళ్లలో అత్యధిక వర్షపాతం నమోదు

గడచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 47 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కాళ్ల 7.6, పెంటపాడు 4.6, ఇరగవరం 3.6, తణుకు 3.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా జిల్లాలో పాలకోడేరు, మొగల్తూరు, ఆచంట, యలమంచిలి మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.
News September 27, 2025
పర్యాటక కేంద్రంగా ప.గో జిల్లా- నేడు టూరిజం డే

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. తణుకులో స్టార్ హోటల్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేశారు. మొగల్తూరు మండలం పేరుపాలెం సముద్రం తీరా వెంబడి రిసార్ట్స్ పేరుతో నిర్మిస్తున్న అతిథి గృహాలకు గతంలో ప్రభుత్వం మూడు ఎకరాల భూమిని కేటాయించింది. ఉండిలో ఫిష్ ఆంధ్ర అక్వేరియం, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయనున్నారు.