News December 15, 2025

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

image

ఏలూరు జిల్లాలో సోమవారం సాయంత్రం విషాదం నెలకొంది. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 16, 2025

పోర్టు కళావాణి స్టేడియం స్వాధీనం చేసుకున్న యాజమాన్యం

image

అక్కయ్యపాలెం జాతీయ రహదారి కానుకొని ఉన్న పోర్టు కళా వాణి ఆడిటోరియం లీజు ఒప్పందాలను రద్దు చేసినట్లు విశాఖ పోర్ట్ అథారిటీ యాజమాన్యం ప్రకటించింది. క్రీడా సముదాయం గతంలో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించామని లీజ్ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు పాటించకపోవడంతో రద్దుచేసి నోటీసులు జారీ చేశామని పోర్టు యాజమాన్యం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో స్టేడియం స్వాధీనం చేసుకున్నారు.

News December 16, 2025

‘నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకో’

image

ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో కాల్పులు జరుపుతున్న టెర్రరిస్టులను ధైర్యంగా <<18564673>>అడ్డుకున్న<<>> అహ్మద్ ప్రస్తుతం బుల్లెట్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనను అతని బంధువు ముస్తఫా మీడియాకు వెల్లడించారు. ‘నేను ఉగ్రవాదిని అడ్డుకోవడానికి వెళ్తున్నా. నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకో’ అని చెప్పి అహ్మద్ వెళ్లాడని తెలిపారు. తన కొడుకు నిజమైన హీరో అని, అతనిని చూసి గర్విస్తున్నట్లు తండ్రి చెప్పారు.

News December 16, 2025

VJA: 80 మెట్రిక్ టన్నుల భవానీ దుస్తుల తొలగింపు

image

భవానీ దీక్షల విరమణ సందర్భంగా VMC ఆధ్వర్యంలో సమగ్రమైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 80 మెట్రిక్ టన్నుల భవానీ దుస్తులు సహా మొత్తం 380 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సిబ్బంది తొలగించారు. 68 వాటర్ పాయింట్లు ఏర్పాటు చేసి, 1,690 మంది పారిశుద్ధ్య కార్మికులు 3 షిఫ్ట్‌లలో విధులు నిర్వహించారు. మెరుగైన నిర్వహణతో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించిన సిబ్బందిని కమిషనర్ ధ్యాన్‌చంద్ర అభినందించారు.