News March 16, 2025

ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తప్పదా?

image

నూజివీడులో 32 వార్డులు ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో YCP 25 చోట్ల గెలవడంతో ఛైర్‌పర్సన్‌గా త్రివేణి దుర్గా ఎన్నికయ్యారు. ఇటీవల 10మంది కౌన్సిలర్లు TDPలోకి రావడంతో ఆ పార్టీ బలం 17కి చేరింది. దీంతో ప్రస్తుత ఛైర్‌పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి.. ఆ పదవిని తమ ఖాతాలో వేసుకోవడానికి TDP ప్రయత్నిస్తోంది. ఇది జరగాలంటే 22 మంది మద్దతు అవసరం కాగా.. మిగిలిన 5మంది కౌన్సిలర్ల కోసం టీడీపీ ఎదురు చూస్తోంది.

Similar News

News March 16, 2025

గుడ్ న్యూస్.. ఈ నెల 21 నుంచి వర్షాలు

image

TG: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

News March 16, 2025

పవన్ BJP మైకం నుంచి బయటపడాలి: షర్మిల

image

AP: Dy.CM పవన్ చేగువేరా, గద్దర్ సిద్ధాంతాలకు నీళ్లొదిలేశారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారని, జనసేన పార్టీని ‘ఆంధ్ర మతసేన’గా మార్చారని ధ్వజమెత్తారు. మత పిచ్చి, BJP ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరమన్నారు. పవన్ ఇప్పటికైనా ఆ పార్టీ మైకం నుంచి బయటపడాలని సూచించారు.

News March 16, 2025

OTD: సచిన్ సెంచరీల సెంచరీ

image

సచిన్ టెండూల్కర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 13 ఏళ్లు అయింది. మార్చి 16, 2012లో బంగ్లాపై సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచారు. సచిన్ 99 సెంచరీలు చేసి 100 శతకాలు పూర్తి చేయడానికి ఏడాదికి పైగా (369రోజులు) సమయం పట్టింది. ఇప్పటి వరకు మాస్టర్ బ్లాస్టర్ రికార్డ్ చెక్కుచెదరకపోగా, యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీ(82) ఒక్కరే ఆ మైలురాయికి దగ్గర్లో ఉన్నారు.

error: Content is protected !!