News October 27, 2025

ఏలూరు జిల్లాలో హై అలర్ట్ ప్రకటన

image

మొంథా తుఫాన్‌ ప్రభావంతో రేపు జిల్లాలోని 13 మండలంలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ వెట్రీ సెల్వి అన్నారు. జిల్లాలోని 14 మండలాల్లో హై అలెర్ట్ ప్రకటించడం జరిగిందన్నారు. తుఫాన్ సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో జిల్లాలోని 763 హోర్డింగ్స్‌ను తొలగించామన్నారు. ముంపు గ్రామాలలో 100 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశామన్నారు.123 మంది గర్భిణీలను ఆస్పత్రికి తరలించామన్నారు.

Similar News

News October 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 28, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 7.00 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 28, 2025

కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాదపు హెచ్చరిక జారీ

image

‘మెంథా’ తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో సోమవారం సాయంత్రం 5వ ప్రమాదవ హెచ్చరిక ప్రకటన చేశారు. తుపాను 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 5, 6వ నంబరు ప్రమాదకర సూచికలుగా పరిగణిస్తారు. గాలులు, అలలు పోర్ట్ పరిసరాల్లో ప్రభావం చూపుతాయని అర్థం. ఈ నంబర్ల హెచ్చరికలు జారీచేస్తే పోర్టులో కార్యకలాపాలన్నీ నిలిపేయాలి. కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు సెలవు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు

News October 28, 2025

చిత్తూరు జిల్లాలో నేడు కూడా స్కూళ్లకు సెలవు

image

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.