News April 2, 2025

ఏలూరు జిల్లాలో 112 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

ఏలూరు జిల్లాలో మహిళా శిశు అభివృద్ధి సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధింత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 సీడీపీవోల కార్యాలయాల పరిధిలోని అంగన్వాడీ కమిటీ ఛైర్మన్ కె.వెట్రిసెల్వి మంగళవారం ఆమోదించారని ఐసీడీఎస్ పీడీ శారద తెలిపారు. 12 మంది అంగన్వాడీలు, ఏడుగురు మిని వర్కర్సు. 93మంది హెల్పర్లను గౌరవ వేతనంపై తీసుకుంటామన్నారు. స్థానిక మహిళలై ఉండి పదవ తరగతిలో ఉత్తీర్ణలై ఉండాలన్నారు.

Similar News

News February 22, 2026

T20WC: శ్రీలంకపై ఇంగ్లండ్ స్కోర్ ఎంతంటే?

image

పల్లెకెలె: భారీ హిట్టర్లున్న ఇంగ్లండ్ జట్టును శ్రీలంక తక్కువ పరుగులకే కట్టడి చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 రన్స్ చేసింది. ఓపెనర్ సాల్ట్ 62 పరుగులతో రాణించారు. చివర్లో విల్ జాక్స్(21) వేగంగా రన్స్ రాబట్టారు. వెల్లలాగే 3 వికెట్లతో సత్తా చాటారు. శ్రీలంక విజయ లక్ష్యం 147 పరుగులు.

News February 22, 2026

రైతోత్సవం మేళా 2026ను ప్రారంభించిన: ఎంపీ

image

జిల్లాలో సేంద్రీయ‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు MP కేశినేని శివ‌నాథ్ ప్రకటించారు.
ఆర్గానిక్ రైతోత్సవం, నేచురల్ ఫార్మింగ్ మేళా-2026ను ఆయన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ప్రారంభించారు. జిల్లాలోని 16 మండలాల వారీగా 3 రోజుల సమగ్ర శిక్షణా శిబిరాలు నిర్వహించి రైతులను ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.

News February 22, 2026

లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా: అంబటి

image

AP: వైసీపీ చీఫ్ జగన్‌పై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా? అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న CM చంద్రబాబు తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురవ్వక తప్పదని హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంపై సీబీఐ కమిటీ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిందని, అయినా దానిపై వక్రభాష్యాలు ఎందుకని నిలదీశారు. ప్రజలకు వాస్తవమేంటో తెలుసని చెప్పారు.