News March 22, 2025
ఏలూరు జిల్లాలో 155.29 కి.మీ రోడ్డులు పూర్తి: కలెక్టర్

ఏలూరు జిల్లా వ్యాప్తంగా 850 గోకుల షెడ్డులు మంజూరు కాగా ఇప్పటికే 623 పూర్తిగా మిగిలినవి పురోగతిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పల్లె పండుగ కింద జిల్లాలో 162.33 కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్ధేశించిందన్నారు. పంచాయితీరాజ్ ద్వారా ఇంతవరకు 155.29 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డుల నిర్మాణం పూర్తిచేశారన్నారు.
Similar News
News July 4, 2025
‘కోడిగుడ్ల సరఫరాకు వివరాలు ఇవ్వండి’

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లా స్థాయి కోడిగుడ్ల సేకరణ, కొనుగోలు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల, ఆశ్రమ, కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలు, కళాశాలలు, ఫూలే పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్లు అందించేందుకు వివరాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
News July 4, 2025
మిర్యాలగూడ: లక్కీ డ్రా పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్

మిర్యాలగూడలో లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మిర్యాలగూడలో నిందితుల వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవర్ మీడియా ద్వారా వెల్లడించారు. నిందితుల నుంచి రూ.70 లక్షల విలువ చేసే ఫర్నిచర్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2,143 మంది బాధితుల నుంచి సుమారు రూ.1.37 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు.
News July 4, 2025
నల్గొండ జిల్లాలో యువకుడి ఆత్మహత్య

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జక్కలి మత్స్యగిరి(22) పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.