News April 9, 2024

ఏలూరు జిల్లాలో 16 కిలోల బంగారం స్వాధీనం

image

ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద విస్తృత వాహన తనిఖీలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏలూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మొత్తం రూ. 22,18,600 నగదు, 140 లీటర్ల మద్యం, 16.258 కిలోల బంగారం, 31.42 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Similar News

News April 20, 2025

ప.గో: ‘శిక్షణ.. సబ్సిడీతో రూ.10లక్షల రుణం’

image

డ్రోన్ కొనుగోలుకు రైతు గ్రూపులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం  కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు, డ్రోన్ గ్రూపు సభ్యులు కన్వీనర్, కో కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. డ్రోన్ పైలెట్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డ్రోన్ కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రూ.10 లక్షల రుణం అందిస్తామన్నారు.

News April 19, 2025

ఉండి: మహిళ మెడలో గొలుసు అపహరణ

image

ఉండి రాజుల పేటలో ఉంటున్న అగ్ని మాత్రం వరలక్ష్మి మెడలోని 4 కాసుల బంగారు తాడును శనివారం గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. వరలక్ష్మి గత పది సంవత్సరాలుగా ఉండిలో నివాసం ఉంటుంది. శనివారం వేకువజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి డోర్ తీసుకొని వచ్చి అటు ఇటు చూస్తుండగా వరలక్ష్మి ఎవరు అని అడగగా, తన నోరునొక్కి మెడలోని బంగారు తాడును లాక్కెళ్లాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

News April 19, 2025

వల్లూరులో సందడి చేసిన సినిమా యూనిట్

image

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మధురం’ చిత్ర యూనిట్ ఆచంట మండలం వల్లూరులో సందడి చేసింది. తాను తీసిన మొదటి సినిమాను ప్రేక్షకులు అందరూ విజయవంతం చేయాలని వల్లూరుకు చెందిన హీరో ఉదయ్ రాజ్ కోరారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో మొత్తం షూటింగ్ జరిగిందన్నారు. తనను ఆదరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!