News February 28, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

✷ ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు* బ్యాలెట్ పేపర్ల స్ట్రాంగ్ రూమును పరిశీలించిన ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ✷ ద్వారకాతిరుమల హుండీ ఆదాయం రూ.2.22 కోట్లు ✷ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ✷పట్టిసీమ వీరేశ్వరునికి రూ.42 లక్షల రికార్డు స్థాయి ఆదాయం * టీ. నర్సాపురం, ఉంగుటూరులో రథోత్సవాలు * 3,14,984 మంది ఓటర్లకు గాను 2,18,902 మంది ఓటు వినియోగం 

Similar News

News February 28, 2025

ములుగు జిల్లావ్యాప్తంగా పోలైన ఓట్లు

image

ములుగు జిల్లా వ్యాప్తంగా 9మండలాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా పోలైన ఓట్ల వివరాలు.. ములుగు మండలంలో 193 ఓట్లకు 180, వెంకటాపూర్ 40కి 35, గోవిందరావుపేటలోకి  108కి 102, తాడువాయి 65కి 58 ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉండగా ఏటూరునాగారంలో 46కి 44, కన్నాయిగూడెం 19కి 18, మంగపేట 95కి 88, వాజేడులో 33కి 31, వెంకటాపురం 29కి 27 ఓట్లు నమోదు అయినట్లు అధికారులు చెప్పారు.

News February 28, 2025

‘కన్నప్ప’ ఆఫర్‌ను రెండుసార్లు రిజెక్ట్ చేశా: అక్షయ్ కుమార్

image

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’లో శివుడి క్యారెక్టర్ చేసేందుకు ముందు 2 సార్లు ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశానని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తెలిపారు. కానీ ఆ పాత్రకు తానే సరిగ్గా సరిపోతానంటూ విష్ణు చెప్పిన విధానం నచ్చడంతో అంగీకరించినట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రం విడుదల తర్వాత శివుడి గురించి ఎవరు ఆలోచించినా అక్షయ్ రూపమే దర్శనమిస్తుందని విష్ణు అన్నారు. కన్నప్ప APR 25న రిలీజ్ కానుంది.

News February 28, 2025

NZB: మార్చ్‌1న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

image

నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చ్‌1న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.విజయ్ కాంత్ రావు తెలిపారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్ వద్ద ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. అండర్ 14, 16, 18 బాలికలతో పాటు మహిళ, పురుషులకు వేరువేరుగా ఎంపికలు ప్రక్రియ ఉంటుందన్నారు. ఎంపికైన వారిని హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు.

error: Content is protected !!