News February 28, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

✷ ఏలూరు చేరుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు✷జిల్లావ్యాప్తంగా ఘనంగా టైలర్ల దినోత్సవ వేడుకలు ✷ అన్ని పాఠశాలలు, కాలేజీల్లో సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు ✷ కూటమి ప్రభుత్వం బడ్జెట్ పట్ల కూటమి నాయకుల హర్షం ✷ఇది మోసపూరిత బడ్జెట్: సీపీఐ నేత రామకృష్ణ ✷ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం✷ పలు శివాలయాలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 

Similar News

News March 1, 2025

మాజీ సీఎం కేసీఆర్‌కు పెండ్లి ఆహ్వాన పత్రిక

image

మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ దంపతులకు మాజీ హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం తన మనవడి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. పెండ్లికి సకుటుంబ సమేతంగా రావాలని కేసిఆర్‌ను ఈ సందర్భంగా ఆయన కోరారు. పెండ్లికి తప్పకుండా వస్తానని మాజీ ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు.

News March 1, 2025

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ పై 25% రాయితీ: జిల్లా కలెక్టర్

image

శుక్రవారం సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. మార్చి 31వ తేదీతో లే అవుట్ల దరఖాస్తుల రుసుము చెల్లించే గడువు ముగుస్తుందన్నారు.

News March 1, 2025

ఇంటర్ పరీక్షలు.. సీఎస్ కీలక సూచనలు

image

TG: ఇంటర్ పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు. పరీక్షల నిర్వహణపై వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చేతి గడియారంతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సీఎస్ ఆదేశించారు.

error: Content is protected !!