News March 1, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

* పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ ర్యాలీ ప్రారంభం✷ఎన్నికల కౌంటింగ్ కట్టుదిట్టంగా చేయాలి జిల్లా కలెక్టర్ * జిల్లాలో ప్రారంభమైన మొదటి సంవత్సర ఇంటర్ పరీక్షలు ✷ స్ట్రాంగ్ రూమును పరిశీలించిన కలెక్టర్ ✷జిల్లాలో 94. 14% ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ✷ దగాకోరు బడ్జెట్ సిపిఐ నేతలు ✷ కైకలూరులో పెద్దింట్లమ్మ, భీమడోలు జాతర ప్రారంభం * తమ్మిలేరు మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

Similar News

News January 22, 2026

ఈ నెల 29న విడుదల కానున్న ఏపీ మత్స్యకారులు

image

బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులను ఈ నెల 29న విడుదల చేసి భారత్‌కు పంపనున్నట్లు Bangladesh Coast Guard ప్రకటించిందని ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది ఉన్నారు. అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు.

News January 22, 2026

నిజామాబాద్‌లో కత్తిపోట్ల కలకలం

image

నిజామాబాద్ నగరం ముజాహిద్ నగర్‌లో గురువారం కత్తిపోట్ల కలకలం రేపింది. స్థానికంగా పిల్లలు ఆడుకుంటున్న సమయంలో వారి మధ్య మొదలైన చిన్న గొడవ పెద్దదిగా మారింది. అక్కడే ఉన్న జహీర్ గొడవను ఆపేందుకు ప్రయత్నించగా, ఆగ్రహం చెందిన కొందరు కత్తితో దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన జహీర్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 22, 2026

టీచర్లు చదువుకుంటామంటే అనుమతించడం లేదు: APTF

image

AP: 5 ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన టీచర్ల ఉన్నత చదువులకు GOలో లేని నిబంధనలు పెడుతూ అనుమతించడం లేదని APTF విమర్శించింది. ‘140 మంది టీచర్లు దరఖాస్తు చేస్తే 100 మందిని డైరక్టరేట్ తిరస్కరించింది. ఇప్పటికే కొందరు కాలేజీల్లో ఫీజులూ కట్టారు. అయినా అధికారులు పెండింగ్‌లోఉంచారు’ అని సంఘం నేతలు హృదయరాజు, చిరంజీవి పేర్కొన్నారు. GO 342 ప్రకారం చదువుకోడానికి అవకాశం ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి శశిధర్‌ను కోరారు.