News February 28, 2026
ఏలూరు: జిల్లా అధికారులతో ఎస్పీ సమీక్ష

ఏలూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారంపై ఎస్పీ ప్రతాప్ కిషోర్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తీవ్రమైన నేరాలు, మహిళలు, చిన్నారులపై జరిగిన దాడుల కేసుల్లో విచారణ ఏ దశలో ఉందో అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో వెంటనే ఛార్జ్ షీట్లను సిద్ధం చేసి, సంబంధిత న్యాయ స్థానాల్లో నిర్ణీత కాలవ్యవధిలో ఫైల్ చేయాలని స్పష్టం చేశారు.
Similar News
News March 1, 2026
BHPL: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఫలితాల్లో గౌతమ్ ప్రతిభ

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష(AISSEE) ఫలితాల్లో జయకేతనం ఎగిరేసి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం గౌతమ్ సత్తా చాటారు. 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పరీక్షలో గౌతమ్ రికార్డు స్థాయి ర్యాంకులతో జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్, జాతీయ స్థాయిలో 240వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబర్చాడు.
News March 1, 2026
ప్రకాశం: యువతి ఏకాంత వీడియోలతో బ్లాక్‌మెయిల్

వివాహిత పర్సనల్ వీడియోలు ఆమె భర్త, తండ్రికి పంపి బెదిరిస్తున్న మాజీ ప్రియుడిపై గుంటూరు PSలో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. కొరిటెపాడుకి చెందిన ఓ యువతి, ప్రకాశం (D) యువకుడు కళాశాల రోజుల్లో ప్రేమించుకున్నారు. ఆ యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మాజీ ప్రియుడు ప్రేమించే సమయంలో యువతిని ఏకాంతంగా కలిసిన వీడియోలను భర్త, తండ్రికి పంపాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 1, 2026
సంగారెడ్డి: జిల్లాలో నేటి నుంచి పోలీస్ యాక్ట్

సంగారెడ్డి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30, 30(ఏ) ఈ నెల 1 నుంచి 31 వరకు అమలులో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసుల అనుమతి లేకుండా జిల్లాలో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. పోలీసుల నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


