News February 23, 2026

ఏలూరు జిల్లా కలెక్టర్ అసహనం

image

ఏలూరు జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ నిర్మాణ పనుల ప్రగతిపై కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఉన్న 45 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, 108 ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పనులను చేపట్టాలని నిర్దేశించారు. అయితే, వీటిలో ఇంకా 22 మరుగుదొడ్లు, 44 తాగునీటి సరఫరా, వాటర్ ట్యాంకుల పనులు కనీసం ప్రారంభించకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

Similar News

News February 25, 2026

జీడీపీ దూకుడు: 8 శాతం దాటనున్న వృద్ధి!

image

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి ఏకంగా 8.1 శాతానికి చేరుతుందని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గ్రామాల్లో పంటల దిగుబడి బాగుండటం, నగరాల్లో జనం ఖర్చులు పెరగడమే దీనికి కారణం. ఫిబ్రవరి 27న వెలువడే ప్రభుత్వ అధికారిక లెక్కల్లో ఈ విషయం స్పష్టంగా తెలియనుంది.

News February 25, 2026

విమాన ప్రయాణం సేఫ్.. DGCA కొత్త రూల్స్!

image

విమాన ప్రమాదాలు పెరుగుతుండటంతో DGCA రూల్స్ మార్చేసింది. చార్టర్డ్ విమానాల ఓనర్లు వెబ్‌సైట్‌లో విమాన వయసు, పైలట్ ఎక్స్‌పీరియన్స్ వంటి వివరాలన్నీ పెట్టాలి. సేఫ్టీ విషయంలో పైలట్లనే కాకుండా పైఅధికారులనూ బాధ్యుల్ని చేస్తారు. రూల్స్ బ్రేక్ చేస్తే పైలట్ లైసెన్స్ ఐదేళ్ల వరకు కట్ అవుతుంది. వాతావరణం బాగోకపోతే విమానం ఆపేసే పవర్‌ పైలట్‌కు ఇచ్చారు. ఆపరేటర్లు రియల్ టైమ్ వెదర్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

News February 25, 2026

గుంతకల్లు డివిజన్‌లో ఖాళీల భర్తీకి కసరత్తు

image

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్‌లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లించనున్నారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయానికి సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించవచ్చన్నారు.