News January 3, 2026
ఏలూరు జిల్లా కస్తూర్బా స్కూళ్లలో ఉద్యోగాలు

కాకినాడ జిల్లాలో 2 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్ – 3 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. నేటి నుంచి జనవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. టెన్త్ పాసైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
Similar News
News February 15, 2026
ADB: ప్రేమ వంచన.. తల్లైన ఇంటర్ విద్యార్థిని

ADB ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రసవం కావడం కలకలం రేపింది. గతంలో హాస్టల్‌లో ఉండి చదువుకున్న బాలిక, ఆ తర్వాత ఇంటి నుంచే కళాశాలకు వెళ్లేది. ఇటీవల ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షించగా గర్భవతిగా తేలింది. శనివారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. HYD యువకుడే బాధ్యుడని అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు బాలిక తెలిపలేదని ICPS బృందం తెలిపింది.
News February 15, 2026
శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాల పేర్లు తెలుసా…!

బ్రహ్మోత్సవాలు అంటే వాహన సేవలు అని తెలుసు. కానీ శ్రీకాళహస్తిలో 9 రోజులు జరిగే వాటిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని అంటారు. దానికి పేర్లు ఉన్నాయి. 1వరోజు దేవరాత్రి, 2వరోజు భూతరాత్రి, 3వ రోజు గాంధర్వ రాత్రి, 4వరోజు నాగరాత్రి, 5వరోజు శివరాత్రి, 6వరోజు బ్రహ్మ రాత్రి, 7వరోజు స్కంద రాత్రి, 8వరోజు ఆనంద రాత్రి, 9వరోజు ఋషి రాత్రి అంటారు.
News February 15, 2026
మెదక్: ప్రసిద్ధ శైవక్షేత్రాలు.. ఇవిగో..!

1. మెదక్ ఏడుపాయల వనదుర్గా గుడి
2. కొమురవెల్లి మల్లన్న ఆలయం
3. ఝరాసంగం కేతకి సంగమేశ్వరాలయం
4. హుస్నాబాద్ రాజేశ్వరుడి గుడి
5. సిద్దిపేట శరభేశ్వర ఆలయం
6. ముంబోజిపల్లి మల్లికార్జున స్వామి ఆలయం
7. కాజిపల్లి కాలభైరవ సన్నిధి
8. వర్గల్ శంభు లింగేశ్వర గుడి
9. బడంపేట రాచన్నస్వామి ఆలయం
10. కంగ్టి సిద్దేశ్వర గుడి
11. ఖేడ్ కాశీనాథ మందిరం
12. రాయికోడ్ వీరభద్ర స్వామి ఆలయం
13. ఫసల్వాది మహామేరు క్షేత్రం
SHARE IT.


