News December 30, 2025
ఏలూరు: ‘జిల్లా పోయే.. IIPM వచ్చే’

చారిత్రాత్మక పట్టణం నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలన్న స్థానికుల కల ఈసారి కూడా నెరవేరలేదు. జిల్లా మార్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు తాజా పరిణామాలు నిరాశను మిగిల్చాయి. అయితే, రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం పట్టణానికి కొంత ఊరటనిచ్చింది. నూజివీడులో IIPM ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈక్రమంలో పట్టణంలో ‘జిల్లా పోయే.. ఐఐపీఎం వచ్చే’ అనే చర్చ సర్వత్రా సాగుతోంది.
Similar News
News December 31, 2025
పశువుల్లో పొదుగువాపు వ్యాధి లక్షణాలు

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో పొదుగువాపు వ్యాధి చాలా ప్రమాదకరమైనది. పశువుల షెడ్‌లోని అపరిశుభ్ర వాతావరణం, యాజమాన్య లోపాల వల్ల పాలిచ్చే పశువులకు ఇది సోకే అవకాశం ఎక్కువ. పొదుగు వాచిపోవడం, పాలు నీరులా మారడం, విరగడం, అందులో తెల్లటి ముక్కలు కనిపించడం, పశువులు పాలు పిండనీయకపోవడం వంటి లక్షణాలను బట్టి పశువుల్లో ఈ వ్యాధిని గుర్తించవచ్చు. పొదుగువాపు వల్ల పాల ఉత్పత్తి బాగా తగ్గుతుంది.
News December 31, 2025
స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

TG: SC విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టితో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ గడువు ముగియనుంది. దానిని MAR31 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉపసంచాలకులు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్, ఆపై చదువులు చదువుతున్న అర్హులైన SC విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి రెన్యువల్/ఫ్రెష్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 31, 2025
విశాఖ: ప్లాస్టిక్ కవర్ కనిపిస్తే చాలు.. రూ.2,000 ఫైన్!

ఎంవీపీ కాలనీ సెక్టర్-9 చేపల మార్కెట్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై సూపర్వైజర్ సత్తిబాబు, సానిటరీ ఇన్స్పెక్టర్ రవి ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వాడుతున్న వారికి రూ.2000 జరిమానా విధించారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలని, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.


