News March 30, 2025

ఏలూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ ఉగాది శుభాకాంక్షలు

image

జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి తొలి పండగ అయిన ఉగాదిని జిల్లా ప్రజలు ఆనందంతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, వెల్లివిరియాలని కోరారు. రైతులకు పాడిపంటలు బాగుండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 21, 2026

పిల్లలకు నెబులైజర్ వాడుతున్నారా?

image

వాతావరణం మారినపుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినపుడు పిల్లల ఊపిరితిత్తుల్లో తెమడ చేరి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు మాత్రం నెబ్యులైజర్‌ వాడాలి. కానీ కొంతమంది ముక్కు దిబ్బడ, జలుబు వేగంగా తగ్గుతాయని సొంతంగానే నెబ్యులైజర్‌ వాడుతుంటారు. కానీ అది సరికాదు. డాక్టర్‌ సలహా మేరకే నెబ్యులైజర్‌ని ఉపయోగించాలి. ఒకవేళ పిల్లలకు అలర్జీ సమస్య ఉంటే అత్యవసర సమయంలో నెబ్యులైజర్‌ వాడచ్చు.

News February 21, 2026

NZB: విద్యాశాఖలో ప్రక్షాళన.. ప్రైవేట్ స్కూల్ సెక్షన్ల మార్పు

image

జిల్లా విద్యాశాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బందిపై వేటు పడనుంది. ప్రైవేట్ పాఠశాలల విభాగాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని తక్షణమే మార్చాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. జిల్లాలో 9 మంది సిబ్బంది ప్రైవేట్ స్కూల్ పనులు చూస్తుండగా, ఐదుగురు మూడేళ్లుగా అక్కడే ఉండటంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 3 రోజుల్లో సెక్షన్ల మార్పునకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

News February 21, 2026

ఉమ్మడి NZB జిల్లాల్లో షట్టర్ గ్యాంగ్ హల్‌చల్

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో నెల రోజుల్లోనే 5 భారీ చోరీలు జరగడంతో ప్రజలు వణుకుతున్నారు. తాళం వేసిన ఇళ్లు, షట్టర్లే లక్ష్యంగా నలుగురు సభ్యుల ముఠా మారణాయుధాలతో తిరుగుతూ నగదు, బంగారం దోచుకెళ్తోంది. జనవరి 10న ఏకకాలంలో 5 దుకాణాల్లో చోరీకి పాల్పడటం సంచలనం రేపింది. సీసీ కెమెరాల ఆధారంగా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నారు.