News January 10, 2026
ఏలూరు జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా కమిటీ నియామకం

ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కమిటీ నియామకాన్ని జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ శుక్రవారం ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా బుర్రి శ్రీకర్, ఉపాధ్యక్షులుగా మరుబరిక శ్రీనివాస్, తిరివీధి రాజేంద్రప్రసాద్, మొవ్వ ఫణీంద్ర కుమార్, గంజి బాలాజీ, జనరల్ సెక్రటరీలుగా రాయల నాగమల్లేశ్వరరావు, పగుర్ల చిట్టి బాబు నియమితులయ్యారు.
Similar News
News February 17, 2026
కరీంనగర్: ‘అధికారుల్లో జవాబుదారితనానికి ఆర్టీఐ కీలకం’

అధికారుల్లో జవాబుదారితనం పెంచేందుకు సమాచార హక్కు చట్టం (RTI) దోహదపడుతుందని రాష్ట్ర సమాచార కమిషనర్లు స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దరఖాస్తుదారులకు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందించడమే కమిషన్ లక్ష్యమని కమిషనర్లు శ్రీనివాసరావు, అయోధ్యరెడ్డి, మోసినా పర్వీన్, భోపాల్ పేర్కొన్నారు. చట్టం పట్ల పౌరులు అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు.
News February 17, 2026
వైవీయూలో మహిళలకు క్రీడా పోటీలు ప్రారంభం

యోగి వేమన విశ్వవిద్యాలయ, కళాశాల 21వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం వేమన క్రీడా మైదానంలో క్రీడలను వర్సిటీ కులసచివులు ఆచార్య పుత్తా పద్మ, వ్యాయామ విద్య క్రీడాశాస్త్రాల విభాగాధిపతి డా. కె.రామ సబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల్లో విద్యార్థినిలు, పరిశోధక విద్యార్థులు, బోధన, బోధనేతర మహిళా సిబ్బంది పోటీ పడ్డారు. విజేతలకు వ్యవస్థాపక దినోత్సవం నాడు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.
News February 17, 2026
నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు: ఉపాధి అధికారిణి

జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘మెగా ప్లేస్మెంట్ & కెరీర్ ఎక్స్పో -2026’కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత తెలిపారు. ఈనెల 19న ఉదయం 9 గం.నుంచి మధ్యాహ్నం 3 గం.వరకు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ లో హాజరు కావాలన్నారు. 18 సంవత్సరాలు పైబడిన మహిళ అభ్యర్థులు అర్హులన్నారు.


