News December 4, 2025
ఏలూరు జిల్లా రైతులకు రూ.213.31కోట్ల ఆర్థికసాయం

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో ‘రైతన్న మీకోసం’ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో రెండు విడతల్లో లక్షా 60 వేల 968మంది రైతులకు రూ.213.31 కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 60 డ్రోన్లను రైతులకు అందించామని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: పవన్

AP: కాకినాడ(D) ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో సమావేశం సందర్భంగా Dy.CM పవన్ అన్నారు. ‘సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేస్తాం. జాలర్ల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయింది. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు’ అని ఆరోపించారు.
News December 4, 2025
జెరుసలేం మాస్టర్స్ విజేతగా అర్జున్ ఇరిగేశీ

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశీ సత్తా చాటారు. ఫైనల్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి జెరుసలేం మాస్టర్స్-2025 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తొలుత రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రా కాగా మొదటి బ్లిట్జ్ గేమ్‌లో విజయం సాధించారు. అర్జున్‌కు టైటిల్‌తో పాటు దాదాపు రూ.50లక్షల (USD 55,000) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. ఈ 22ఏళ్ల కుర్రాడి స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ.
News December 4, 2025
వరంగల్: ఇక ‘గుర్తుల’ ప్రచారం..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అభ్యర్థులు గుర్తులు లేకుండానే గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రస్తుతం గుర్తులు కేటాయించడంతో ఇక వాటితో ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వారికి కేటాయించిన గుర్తులతో హోరెత్తిస్తున్నారు.


