News October 12, 2025

ఏలూరు జిల్లా వ్యాప్తంగా శక్తి టీం విజిబుల్ పోలీసింగ్

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా నాలుగు సబ్ డివిజన్ల పరిధిలో శక్తి టీం సభ్యులు ఆదివారం సాయంత్రం ‘విజిబుల్ పెట్రోలింగ్’ నిర్వహించారు. మహిళలకు భరోసా కల్పిస్తూ, 112 ఫోన్ నెంబర్, ‘శక్తి యాప్’ ఆవశ్యకతను వివరించినట్లు శక్తి టీం ఇన్‌చార్జి సుబ్బారావు తెలిపారు. విద్యార్థులకు, మహిళలకు శక్తి టీం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఐ భరోసా ఇచ్చారు.

Similar News

News October 12, 2025

ప్రధాని పర్యటన.. 7,300మంది పోలీసులతో భద్రత: SP

image

ప్రధాని మోదీ పర్యటనకు 7,300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం రాగమయూరి కమాండ్ కంట్రోల్ రూంలో ఆదివారం భద్రతా ఏర్పాట్లపై ఆయన సెక్టార్, లైజనింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విఐపీల భద్రత, పార్కింగ్ ఏరియాలు, రూట్ డైవర్షన్లు, ప్రజా వాహనాల పార్కింగ్, క్రౌడ్ కంట్రోల్ అంశాలపై సూచనలు ఇచ్చారు.

News October 12, 2025

బిగ్‌బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్.. ఆరుగురి ఎంట్రీ

image

బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 నుంచి ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి ఫ్లోరా సైనీ, శ్రీజను ఎలిమినేట్ చేసినట్లు షో నిర్వాహకులు ప్రకటించారు. హౌస్‌లోకి కొత్తగా నిఖిల్ నాయర్ (సీరియల్ యాక్టర్), దివ్వెల మాధురి, శ్రీనివాస్ సాయి (గోల్కొండ హైస్కూల్ సినిమా ఫేమ్), రమ్య మోక్ష (అలేఖ్య చిట్టీ పికిల్స్), అయేషా(సీరియల్ నటి), గౌరవ్ గుప్తా (సీరియల్ నటుడు) వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

News October 12, 2025

రేపు యథావిధిగా ప్రజావాణి..

image

వనపర్తి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపటినుంచి యథావిధిగా కొనసాగనుంది. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోవడంతో అధికారులు రేపు తిరిగి ప్రారంభిస్తున్నారు. సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని జిల్లాలోని బాధితులు, అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ప్రజావాణిని జిల్లా కలెక్టర్ తాత్కాలికంగా రద్దు చేసిన సంగతీ తెలిసిందే.