News November 13, 2025

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

image

ఏలూరు జిల్లా అంతటా పోలీసు బృందాలు బుధవారం రాత్రి వేళల్లో వాహనాలను తనిఖీ చేశాయి. గంజాయి, అక్రమ మద్యం, డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువులు” రవాణా కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటూ జిల్లా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు కొనసాగనున్నాయని పోలీసులు తెలిపారు.

Similar News

News November 13, 2025

వంటింటి చిట్కాలు

image

* కరివేపాకును ఎండబెట్టి పొడిచేసుకుని కూరల్లో వేసుకుని తింటే కమ్మటి వాసన వస్తుంది.
* తేనె సీసాలో రెండు మిరియాలు వేస్తే చీమలు రావు.
* బియ్యం పురుగు పట్టకూడదంటే కరివేపాకులు వేయాలి.
* కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే త్వరగా పెరుగు పాడవదు.
* నెయ్యి పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి.
* చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడిపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది.

News November 13, 2025

ప్రతీసారి కొట్టేది మేము.. కొట్టించుకునేది మీరు: కాంగ్రెస్ SM

image

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే విజయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో BRSను ఆ పార్టీ శ్రేణులు SMలో ట్రోల్ చేస్తున్నాయి. ‘అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో, కంటోన్మెంట్‌లో కొట్టాం. జూబ్లీహిల్స్‌లో కొడుతున్నాం. ప్రతీసారి కొట్టేది మేము, కొట్టించుకునేది మీరు. ఔర్ కుచ్ బాకీ హై క్యా’ అని పోస్టులు పెడుతున్నాయి. MBNRలో MLC ఎన్నికల్లో ఓడింది మర్చిపోయారా? అని BRS వర్గాలు రివర్స్ కౌంటర్ వేస్తున్నాయి.

News November 13, 2025

సంగాడ్డి: క్రమక్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

సంగారెడ్డి జిల్లాలో వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. గురువారం ఉదయం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 13.1 డిగ్రీలు, గుమ్మడిదలలో 17.0 డిగ్రీలు, అమీన్పూర్‌లో 18.2° డిగ్రీలు, రామచంద్రాపురంలో 12.5 డిగ్రీలు, పటాన్‌చెరులో 12.8° ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 90.6%గా నమోదైంది. ఉదయం పూట చల్లని గాలులు వీచడంతో గ్రామస్థులు చలిమంటలను కాచుకుంటున్నారు.