News May 15, 2024

ఏలూరు: జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్

image

ఏలూరు జిల్లాలో జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడుతూ.. జిల్లాలో సభలు, సమావేశాలకు అనుమతులు ఉండవన్నారు. రోడ్లపై ప్రజలు గుంపులుగా తిరగవద్దని హెచ్చరించారు. రోడ్డుపై ఐదుగురు కంటే ఎక్కువ ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మారణాయుధాలు ప్రదర్శన నిషేధమన్నారు.

Similar News

News September 12, 2025

ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలి: జేసీ

image

జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు ప్రారంభం కావున అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.

News September 11, 2025

మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా దృష్టి: కలెక్టర్

image

స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో బుధవారం ఉపాధి అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గుర్రపు డెక్క నుంచి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి మండలంలో మూడు యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News September 11, 2025

‘ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై తనిఖీ చేయాలి’

image

గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.