News September 21, 2025

ఏలూరు: తగ్గని చికెన్ ధరలు

image

నూజివీడులో మాంసం ధరలు తగ్గకపోవడంతో మాంసప్రియలు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. మటన్ కిలో రూ.800, చికెన్ కిలో రూ.200, చేపలు కిలో రూ.160-300, రొయ్యలు కిలో రూ.300కి అమ్ముతున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో మటన్ కిలో రూ.900, చికెన్ కిలో రూ.220, చేపలు కిలో రూ.180కి విక్రయిస్తున్నట్లు తెలిసింది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉన్నాయో కామెంట్.

Similar News

News September 21, 2025

పలాసలో గంజాయితో నలుగురు మహిళలు అరెస్ట్

image

కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఒడిశాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ సూర్యనారాయణ ఆదివారం ఉదయం తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 75 కిలోల గంజాయి స్వాధీనం తీసుకొని, నలుగురు మహిళలతో పాటు ఓ వ్యక్తిని రిమాండుకు తరలిస్తామన్నారు. చెడు అలవాట్లకు బానిసై యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.

News September 21, 2025

టెన్త్, ఇంటర్‌తో 1,446 ఉద్యోగాలు.. నేటితో ముగియనున్న దరఖాస్తులు

image

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గ్రౌండ్ స్టాఫ్, లోడర్ ఉద్యోగాల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మొత్తం 1,446 ఉద్యోగాలు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు (18-30 ఏళ్లు) ఇంటర్మీడియట్, లోడర్ పోస్టులకు (20-40 ఏళ్లు) టెన్త్ పాసై ఉండాలి. జీతం నెలకు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు ఉంటుంది. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 21, 2025

దుర్గగుడికి తక్కువ సామానుతో రండి: కలెక్టర్

image

దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గ గుడికి వచ్చే భక్తులు తక్కువ సామానుతో రావాలని NTR కలెక్టర్ లక్ష్మీశా కోరారు. భక్తులు తమ వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, నిర్దేశించిన క్యూలైన్లలో మాత్రమే అమ్మవారి దర్శనానికి రావాలని ఆయన సూచించారు. వృద్ధులు, పసిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.