News March 20, 2025

ఏలూరు: తాగునీటి సమస్య తలెత్తితే చర్యలు

image

ఈ వేసవిలో జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం వేసవిలో తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వేసవిలో తాగునీటి సరఫరాపై వారం రోజులలో కార్యచరణ తీసుకోవాలన్నారు.

Similar News

News March 21, 2025

నెల్లూరు: నిరుపేద కుటుంబం.. ఆల్ ఇండియా ర్యాంకు

image

ఉదయగిరి మండలం జి. చెర్లోపల్లి వడ్డిపాలెం గ్రామానికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతుల కుమారుడు శేఖర్ ఆల్ ఇండియా లెవెల్‌లో GATE ECE గ్రూపులో 425వ ర్యాంక్ సాధించారు. శేఖర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా.. తల్లి కూలి పనులకు వెళ్లి శేఖర్‌ని చదివించింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే GATE పరీక్ష రాసి తొలిప్రయత్నంలోనే జాతీయస్థాయి ర్యాంకు సాధించాడు. IITలో M.Tech చేసి మంచి జాబ్ సాధించడమే లక్ష్యమని శేఖర్ అన్నారు.

News March 21, 2025

ఒంగోలు: పసికందు హత్య.. తండ్రికి యావజ్జీవ శిక్ష.!

image

భార్య పైన అనుమానంతో మూడేళ్ల పసికందును హత్య చేసిన కసాయి తండ్రి ఖాదర్‌కి ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి భారతి గురువారం యావజ్జీవ శిక్ష విధించారు. చీమకుర్తిలో భార్య సాల్మాతో కలిసి భర్త ఖాదర్ నివాసం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. ఏడేళ్ల క్రితం భార్యపై అనుమానంతో కుమారుడు సాహుల్ గొంతు కోసి హత్య చేశాడు. నింద రుజువైనందున ఎట్టకేలకు ఏడేళ్లకు అతనికి యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది.

News March 21, 2025

బ్యాడ్మింటన్‌లో సంచలనం

image

బ్యాడ్మింటన్ టోర్నీ స్విస్ ఓపెన్ 2025లో భారత షట్లర్ శంకర్ ముత్తుస్వామి సంచలనం నమోదు చేశారు. వరల్డ్ నం.2 ర్యాంకర్ అండర్స్ ఆంటోన్సన్‌పై విజయం సాధించారు. 18-21, 21-12, 21-5 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.

error: Content is protected !!