News July 10, 2025
ఏలూరు: దాడికి పాల్పడిన వారికి 3 నెలల జైలు శిక్ష

వంకాయగూడెంలో స్థలం వివాదంలో గొడవకు పాల్పడిన దాసరి వీరస్వామి, రాంబాబు, మిరియాల రంగారావుకు ఏలూరు సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రజిని రూ.1000 జరిమానా/మూడు నెలల జైలు శిక్షను బుధవారం విధించారు. 2019 జులైలో ముక్కు గౌతమ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి స్థలంలో గొడవకు దిగి దాడికి పాల్పడినట్లు నేరం రుజువైనందున శిక్ష విధించినట్లు జడ్జి రజిని పేర్కొన్నారు.
Similar News
News July 10, 2025
త్వరలో ఆదర్శ రైతుల ద్వారా పథకాల అమలు: రైతు కమిషన్

TG: త్వరలో గ్రామానికి ఒక ఆదర్శ రైతును ఎంపిక చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ స్కీములను వారి ద్వారా అమలు చేస్తామన్నారు. అయితే ఆదర్శ రైతులకు వేతనాలు ఉండవని స్పష్టం చేశారు. కాగా 2007లో కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. గౌరవ వేతనం కింద నెలకు రూ.1,000 అందించింది. 2017లో BRS ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసింది.
News July 10, 2025
సంగారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా మురళీకృష్ణ

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ మురళీకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. వైద్యులు సహకరించాలని కోరారు.
News July 10, 2025
సంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ల బడ్జెట్ విడుదల

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న గుడ్లకు సంబంధించిన బడ్జెట్‌ను విడుదల చేస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాకు రూ.46,71,612 విడుదల చేశారని, త్వరలోనే సంబంధించిన ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.