News March 11, 2025

ఏలూరు: దివ్యాంగురాలు గీసిన చిత్రం ఆకట్టుకుంది!

image

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో అంధ దివ్యాంగురాలైన బత్తుల అంజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంజు కలెక్టర్ చిత్రపటాన్ని ఎంతో అందంగా గీసి ఆమెకు అందజేశారు. ఈ క్రమంలో ఆమె కృషికి కలెక్టర్‌తో పాటు పలువురు ప్రశంసించారు.

Similar News

News March 11, 2025

సాగునీటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి: కలెక్టర్

image

ఎండుతున్న పంటలకు సాగునీరు అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే అన్వేషించాలని వ్యవసాయ శాఖ అధికారులను, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం ధర్పల్లి, సిరికొండ మండలాల్లో క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. వచ్చే యాసంగిలో నీటి లభ్యత ఆధారంగా పంటలు వేసుకునే విధంగా రైతులను చైతన్యపరచాలన్నారు.

News March 11, 2025

పాడేరు: ‘గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్ర సందర్శన తప్పనిసరి’

image

గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్ర సందర్శన తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సబ్ కల్లెక్టర్స్, 22 మండలాల ఎమ్మార్వోలు, వీఆర్వోలు, గ్రామ, మండల సర్వేయర్లతో మంగళవారం రెవిన్యూ అధికారుల వారాంతపు సమావేశం నిర్వహించారు. ఐవీఆర్ఎస్‌లో వచ్చిన నివేదికలో గ్రామ రెవిన్యూ అధికారి క్షేత్ర సందర్శనలు చేయటం లేదని పేర్కొన్నారు. ఎమ్మార్వోలు బాధ్యత వహించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 11, 2025

భార్యాభర్తల ❤️ బాండింగ్ మరింత పెరగాలంటే..

image

ప్రేమ జంటలు, కొత్త దంపతులను చూస్తే ముచ్చటేస్తుంది. భాగస్వాముల పట్ల కేరింగ్, ఎమోషన్, ఇంటీమసీ బాగుంటుంది. సంసారంలో పడి, ఆఫీసులో బిజీ అయ్యాక లైఫ్ బోరింగ్, రొటీన్‌గా అనిపిస్తుంది. మళ్లీ హనీమూన్ తరహా శృంగారానుభూతులు పొందాలంటే 2:2:2 రూల్ పాటించాలని చెప్తున్నారు నిపుణులు. 2 వారాలకోసారి డేట్‌నైట్, 2 నెలలకోసారి వీకెండ్ గెట్‌అవే, 2 ఏళ్లకోసారి లాంగ్ వెకేషన్ ప్లాన్‌చేస్తే దాంపత్యం అత్యంత సుఖమయం అంటున్నారు.

error: Content is protected !!