News August 23, 2025

ఏలూరు: ‘దివ్యాంగులు ఆందోళన చెందొద్దు’

image

అర్హత ఉన్న ఏ ఒక్కరి పెన్షన్ రద్దు కాదని డీఆర్డిఏ పీడీ విజయరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దివ్యాంగుల పింఛన్ పరిశీలనలో హాజరైన వారిలో 40% కంటే తక్కువ ఉన్నవారికి నోటీసులు జారీ చేశామన్నారు.నోటీసులు ఇచ్చిన వారందరికీ పునరుద్ధరణకు అప్పీలు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాల కొరకు ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయం సంప్రదించమన్నారు.

Similar News

News August 23, 2025

ఇంటర్ కాలేజీల్లో అమలులోకి ఫేషియల్ రికగ్నిషన్

image

TG: 430 ఇంటర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలులోకి వచ్చింది. 1,64,621 మంది విద్యార్థుల్లో ఇప్పటికే 63,587 మంది రిజిస్ట్రేషన్ పూర్తైంది. మిగిలిన వారి రిజిస్ట్రేషన్ సోమవారం కల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. వాట్సాప్ ద్వారా పేరెంట్స్‌కు హాజరు, రిపోర్ట్స్‌పై రియల్ టైమ్ అప్‌డేట్స్ ఇవ్వనున్నారు. ఈ విధానంతో అటెండెన్స్ మానిటరింగ్, ప్రాక్సీ అటెండెన్స్‌కు చెక్ వంటి లాభాలుంటాయని తెలిపారు.

News August 23, 2025

కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను త్వరితగతిన నమోదు చేయండి: కలెక్టర్

image

వివిధ శాఖలకు పురోగతికి సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను త్వరితగతిన నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖలకు సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఆర్టీజీఎస్ లెన్స్‌పై సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ లెన్స్ సైట్‌లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News August 23, 2025

సింగూర్ ఔట్‌ఫ్లో 9,902 క్యూసెక్కులు

image

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి ఇవాళ సాయంత్రం వరకు 11,414 క్యూసెక్కులు వరద జలాలు వచ్చి చేరినట్లు నీటిపారుదల శాఖ డివిజన్ అధికారి నాగరాజు తెలిపారు. ఎగువ నుంచి వరద తగ్గడంతో తెరిచిన నాలుగు గేట్లు క్లోజ్ చేసి కేవలం ఒక్క గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. స్పిల్ వే, జెన్కో కరెంట్, మిషన్ భగీరథ, HMWS, నీటి ఆవిరి కలిపి మొత్తం 9,902 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో కొనసాగుతుందన్నారు.