News December 17, 2025

ఏలూరు: నిరుద్యోగులకు GOOD NEWS

image

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీఎస్‌ఎస్‌డీసీ, ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ సంయుక్తంగా దుబాయ్‌లో జనరల్ హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి జితేంద్ర తెలిపారు. 21-37 ఏళ్ల మధ్య వయసు ఉండి, అనుభవం కలిగిన పురుషులు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.24,450 జీతం ఉంటుందని, ఆసక్తి గల వారు ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.

Similar News

News December 17, 2025

వరంగల్: 77.58 శాతం పోలింగ్ @1PM

image

వరంగల్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 77.58శాతం పోలింగ్ అయింది. చెన్నారావుపేట మండలంలో 84 శాతం, ఖానాపూర్‌లో 70.35, నర్సంపేటలో 82.16, నెక్కొండలో 75.4 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.

News December 17, 2025

NRPT: మూడో విడత.. @1 గంట వరకు పోలింగ్ శాతం

image

జిల్లాలో 3వ విడత GPఎన్నికల్లో భాగంగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ వివరాలను అధికారులు విడుదల చేశారు. జిల్లాలోని కృష్ణ, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్ మండలాల్లో మొత్తం 1,52,648 మంది ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం 1 గంట వరకు 1,22,307 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మొత్తం పోలింగ్ శాతం 80.12% నమోదు అయింది. కృష్ణలో 78.18%, మాగనూర్‌లో 84.17%, మక్తల్‌లో 81.76%, నర్వలో 88.35%, ఊట్కూర్‌లో 72.42 శాతం.

News December 17, 2025

జనగామ: 83.27 శాతం పోలింగ్ @1PM

image

జనగామ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 నుంచి ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 83.27 శాతం పోలింగ్ నమోదయింది. పాలకుర్తిలో 80.06 శాతం, దేవరుప్పులలో 87.64 శాతం, కొడకండ్లలో 83.39 శాతం నమోదయింది.