News April 17, 2025
ఏలూరు: నేరం రుజుకావడంతో 5 ఏళ్ల జైలు

ఏలూరుకు చెందిన కాటుమల రవితేజ, దుర్గలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నారు. పెళ్లైన నాటి నుంచి భర్త తాగుడుకు బానిసై, పాప తనకు పుట్టలేదని తరచూ గొడవ పడేవాడని భార్య తెలిపింది. 2018 సెప్టెంబర్ 1న పాపను కడుపులో బలంగా తండ్రి తన్నడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని, నేరం రుజువు కావడంతో 5 ఏళ్ల జైలు శిక్ష బుధవారం విధించినట్లు ఎస్పీ కిషోర్ తెలిపారు.
Similar News
News April 19, 2025
GNT: మానవత్వం చాటుకున్న లాలాపేట పోలీసులు

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట స్టేషన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంగడిగుంటలో ఏఎస్సై నరసింహారావు, కానిస్టేబుల్ నాగరాజు గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి తన భార్య కాన్పు నొప్పులతో బాధపడుతుందని, వాహన సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గస్తీ పోలీసులు గర్భిణిని తమ వాహనంలో జీజీహెచ్ కాన్పుల వార్డుకు తరలించారు.
News April 19, 2025
బైడెన్ US చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్: ట్రంప్

బైడెన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ట్రంప్ వివాదాస్పద పోస్ట్ చేశారు. ఓపెన్ బోర్డర్ రూపంలో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది క్రిమినల్స్‌ను అమెరికాలోకి రానిచ్చారని ఆరోపించారు. వారిలో హంతకులు, డ్రగ్ డీలర్స్, పిచ్చాస్పత్రుల నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారన్నారు. వారిని దేశం నుంచి వెళ్లగొట్టడమే తన పని అని, అందుకే తనని ఎన్నుకున్నారని తెలిపారు. బైడెన్ US చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్ అని ఫైరయ్యారు.
News April 19, 2025
ALERT: నేడు భారీ వర్షాలు

AP: నేడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.